రసవత్తరంగా రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మదనపల్లె సిటీ : ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్‌బాల్ బాల, బాలికల పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం రెండో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చి టీమ్‌లు పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల క్వార్టర్ ఫైనల్స్‌లో నెల్లూరు–వెస్ట్ గోదావరి జిల్లా జట్లు తలపడగా వెస్ట్ గోదావరి జట్టు 22–0 స్కోరులో విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. చిత్తూరు–కర్నూలు జిల్లా మద్య జరిగిన పోటీల్లో చిత్తూరు జట్టు 29–19 స్కోరుతో విజయం సాధించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. కృష్ణ–గుంటూరు జట్ల మధ్య జరిగిన పోటీలో కృష్ణ 39–25 తేడాతో గెలుపొంది సెమిఫైనల్స్‌కు చేరుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ అజ్జర్వర్ వర్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు,ఝాన్సీరాణి, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీడీలు నరేష్, మెయినుద్దీన్, రియాజ్, ఆసిఫ్, భారతి, శివశంకర్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.


