మదనపల్లి ఎకై ్సజ్ కార్యాలయంలో కస్టడీ నిందితుల విచారణ
● గోప్యంగా విచారిస్తున్న ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి
● జనార్దన్‌రావు కోసం పీటీ వారెంట్ దాఖలు
ములకలచెరువు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి మదనపల్లి సబ్‌జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని కస్టడీకి తీసుకొని మదనపల్లె ఎకై ్సజ్ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు వీరిని కస్టడీకి కోర్టు అనుమతించింది. ముఖ్యంగా కట్టారాజు, బాలాజీల వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసు మలుపుతిరుగుతోంది. కట్టారాజు జనార్దన్‌రావు ముఖ్య అనుచరుడు కాగా, బాలాజీ నకిలీ మద్యం తయారీకి స్పిరిట్, బాటల్ మూతలు సరఫరా చేశాడు. మంగళవారం కడప ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ చంద్రశేఖర్‌రెడ్డి వీరిని గోప్యంగా విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా పకడ్బందీగా విచారణ చేపడుతున్నారు. వీరిద్దరూ ఇబ్రహింపట్నం నకిలీ మద్యం కేసులో సైతం నిందితులుగా ఉన్నారు.
మరో నలుగురి కోసం పీటీ వారెంట్ దాఖలు:
ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న అద్దెపల్లి జనార్దన్‌రావుతో సహా మరో నలుగురిని ఇక్కడికి రప్పించడానికి ఎకై ్సజ్ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. జనార్దన్‌రావు కనుసన్నలోనే ఇబ్రహింపట్నం, ములకలచెరువు నకిలీ మద్యం ప్లాంటు నడుస్తోంది. ఇతనితో పాటు జగన్‌మోహన్‌రావు, తిరుమలశెట్టి శ్రీనివాసురావు, తాండ్రా రమేష్‌బాబు, షేక్ అల్లాబక్షుల కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో వీరి కోసం కోర్టు అనుమతి లభించనుందని అధికారులు చెబుతున్నారు.


