మాదకద్రవ్యాల ఉచ్చులో పడొద్దు
రాయచోటి టౌన్: యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నమయ్య జిల్లా యువజన సర్వీసుల శాఖ కమిషనర్ వీవీ సుబ్బరాయుడు తెలిపారు. రాయచోటి బాలికోన్నత పాఠశాలలో మంగళవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకం దుర్వినియోగం అవుతోందని, దీని దుష్ఫలితం దేశంపై పడుతోందన్నారు. మారకద్రవ్యాలను ఉపయోగిస్తున్న కుటుంబాలలోని వ్యక్తులు సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్ మాట్లాడుతూ మారక ద్రవ్యాల దుర్వినియోగంపై సమష్టిగా పోరాటం సాగించి అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సైరా బాను, స్టెప్ సిబ్బంది వీవీ నారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు అబ్బవరం హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లపై కార్మికులకు
అవగాహన అవసరం
– డీడీఎంఎస్ అధికారి కిషోర్ కుమార్
ఓబులవారిపల్లె : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలపై తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లపై కార్మికులకు అవగాహన అవసరమని నెల్లూరు డీడీఎంఎస్ అధికారి కిషోర్ కుమార్ అన్నారు. ఈవిషయంపై మంగళవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయ ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. నాలుగు కోడ్‌ల గురించి కార్మికులకు వివరించారు. శిక్షణ తరగతుల కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల ఉచ్చులో పడొద్దు


