
ప్రైవేట్ వాటర్ ప్లాంట్‌కు పంచాయతీ నిధుల చెల్లింపు
ఎర్రగుంట్ల : మండలంలోని చిలంకూరు జెడ్పీ పాఠశాల ఆవరణలో ఓ వ్యక్తి నిర్వహించే వాటర్ ప్లాంట్‌కు పంచాయతీ నిధులతో రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లించారని, వెంటనే రికవరీ చేయించాలని వైఎస్సార్‌సీపీ నాయకుడు అరిగాళ్ల మురళి తెలిపారు. సర్పంచ్ శరత్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీలతలకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ పంచాయతీ నిధులతో వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న ప్రైవేటు వ్యక్తి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది మార్చి 26న రూ.28553, గత ఏడాది డిసెంబర్ 11న రూ.588994లు విద్యుత్తు బిల్లుల రూపంలో పంచాయతీ నిధులు చెల్లించారన్నారు. సర్పంచ్ శరత్‌కుమార్ వివరణ కోరగా.. ప్లాంట్ కరెంట్ మీటర్ వివరాలు సేకరించి తెలియజేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలతవ ూట్లాడుతూ విచారణ చేపబడుతామన్నారు.

ప్రైవేట్ వాటర్ ప్లాంట్‌కు పంచాయతీ నిధుల చెల్లింపు