
మినీ లారీ ఢీకొని ఒకరికి గాయాలు
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు సమీపంలోని ఏపీ కార్ల్ సమీపంలో మంగళవారం మినీ లారీ ఐచర్ వాహనం ఢీకొని మోహన్‌రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు..అనంతపురం జిల్లాకు చెందిన మోహన్ రెడ్డి గత కొంతకాలంగా పెద్దరంగాపురం సమీపంలో ఉన్న ఏపీ కార్ల్‌లో రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం అనంతపురం నుంచి ఆయన భార్య బస్సులో పులివెందుల బస్టాండులో దిగింది. ఆమె భర్త మోహన్ రెడ్డికి ఫోన్ చేయడంతో ఆమెను ఏపీ కార్ల్‌లోని తమ నివాసానికి తీసుకెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో బస్టాండ్ వద్దకు వస్తుండగా మినీ ఐచర్ లారీ ఢీకొంది. దీంతో మోహన్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రోడ్డులో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు మోహన్‌రెడ్డికి ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
108 వాహనంలో ఆస్పత్రికి తరలింపు