
భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ
రాజంపేట రూరల్: ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామికి పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా బహుదానదికి గంగా హరతి ఇచ్చారు. అనంతరం కామాక్షిమాతను, త్రేతేశ్వరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి పల్లకిలో కొలువు దీర్చారు. భక్తులు పల్లకిని లాగుతూ..భక్తి పాటలు పాడుతూ..శివనామస్మరణ చేస్తూ గిరిప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణ అనంతరం రాజంపేటకు వచ్చే భక్తులకు చెర్రీస్ స్కూల్ యజమాన్యం వారు బస్సులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షుడు సిద్దా లింగారెడ్డి, కార్యదర్శి పోకల ప్రభాకర్, కోశాధికారి వై నందకిషోర్‌గౌడ్, కమిటి సభ్యులు యుపీరాయుడు, బాలక్రిష్ణారెడ్డి, రాఘవరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కాశీ విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు.