నకిలీ మద్యం.. టీడీపీదే పాపం | - | Sakshi
Sakshi News home page

నకిలీ మద్యం.. టీడీపీదే పాపం

Oct 6 2025 2:46 AM | Updated on Oct 6 2025 2:46 AM

నకిలీ

నకిలీ మద్యం.. టీడీపీదే పాపం

దాడులు, అరెస్ట్‌లు

ప్రజల ప్రాణాలతో చెలగాటం

పాల వ్యాన్‌ ముసుగులో సరుకు సరఫరా

ఎక్స్తెజ్‌ అధికారుల సెర్చ్‌ ఆపరేషన్‌

సాక్షి రాయచోటి/మదనపల్లె : నకిలీ మద్యం తీగ లాగితే డొంక కదులుతోంది. ఒకచోట తయారు చేసి అనేక ప్రాంతాలకు యథేచ్ఛగా సరఫరా చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుని అమ్ముకునే వ్యాపారులు కొందరైతే..స్థానికంగా పేరొందిన టీడీపీ నాయకులే నకిలీ మద్యం తయారీని చేపట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దాదాపు మూడు నాలుగు నెలల నుంచి ఈ తతంగం నడుస్తున్న క్రమంలో ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాకుండా సరిహద్దు ప్రాంతంలోని అటు అనంతపురం, ఇటు చిత్తూరు జిల్లాకు కూడా సరఫరా చేశారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మూడు రోజుల కిందట నకిలీ మద్యం తయారీకి సంబంధించిన యంత్రాలతోపాటు పెద్ద ఎత్తున డంపును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం పెద్దతిప్ప సముద్రం మండలంలో నకిలీ మద్యం స్వాధీనంతోపాటు ఒక వైన్‌షాపును కూడా సీజ్‌ చేయడం కలకలం రేపుతోంది. ములకలచెరువు సమీప ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేసిన అనంతరం నేరుగా బెల్ట్‌షాపులకు సరుకు రవాణా సాగింది. అయితే , ఇక్కడి నుంచి సరఫరాకు పాల వ్యాన్‌ తరహాలో ఆటో ద్వారా తతంగాన్ని నడిపినట్లు తెలియవచ్చింది. ములకలచెరువులో ఇటీవల ఎకై ్సజ్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్న నకిలీ మద్యం వ్యవహారంలో కీలక అంశాలు లభ్యమయ్యాయి. అందుకు సంబంధించి అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి బెల్ట్‌ షాపులకు సరఫరా అయిన వివరాలు లభించాయి.

సెర్చ్‌ ఆపరేషన్‌

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎకై ్సజ్‌ అధికారులు సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగించారు. నిందితుల నుంచి వచ్చిన సమాచారంతోపాటు స్థానికుల ద్వారా అందుకున్న రహస్య సమాచారం మేరకు నియోజకవర్గంలో విస్తృతంగా దాడులు చేశారు. ప్రధానంగా పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం, బి.కొత్తకోట, తంబళ్లపల్లెతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ, తోటల్లోనూ ఆపరేషన్‌ నిర్వహించారు. పెద్దతిప్పసముద్రం మండలంలోని తోటలో నిల్వ చేసిన పలు రకాల నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎకై ్సజ్‌ సీఐ ఆధ్వర్యంలో ఒక్కో మండలానికి ఒక్కో బృందం వెళ్లి దాడులు నిర్వహించింది.

జిల్లాలో కలకలం

జిల్లాలో నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్కడ చూసినా చర్చ కొనసాగుతోంది. టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకుడు సురేంద్రనాయుడుతోపాటు మరికొంతమంది కీలక టీడీపీ నేతల ప్రమేయంతో కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. విజయవాడకు చెందిన వ్యక్తులతోపాటు స్థానికంగా టీడీపీలో పలుకుబడి కలిగిన నాయకులు ఇందులోకీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆదాయ మార్గాల కోసం టీడీపీ నాయకులు వక్రమార్గాలను ఎంచుకుని ప్రజల ప్రాణాలను లెక్కచేయకుండా అనేక చోట్లకు నకిలీ మద్యం సరఫరా చేసిన నేపథ్యంలో రానున్న కాలంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

ములకలచెరువులో బట్టబయలైన నకిలీమద్యం తయారీ రాకెట్‌ వ్యవహారంలో మద్యం తరలింపు, విక్రయాలకు సంబంధించిన లెక్కలను ఎకై ్సజ్‌ అధికారులు పక్కాగా సేకరించారని, దీనికి బలం చేకూర్చే వివరాల ఆధారాలు లభించాయని తెలుస్తోంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో మద్యం కొనుగొలు చేసిన వ్యక్తులు, దుకాణాల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఓ మద్యం షాపును సీజ్‌ చేసిన ఎకై ్సజ్‌ అధికారులు మిగిలిన వారి వివరాలతో ఏం చేయబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది.

ఎవరికెంత

ములకలచెరువు నకిలీమద్యం తయారీ కేంద్రం నుంచి ఏ మేరకు మద్యం తయారైంది, దాన్ని ఎక్కడెక్కడికి, ఎవరెవరికి సరఫరా చేసింది వివరాలు లభ్యమైనట్టు తెలిసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువుకు సమీపంలో పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాలు, సరిహద్దులో తంబళ్లపల్లె మండలం ఉండగా తర్వాత పెద్దమండ్యం, కురబలకోట మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో ప్రతిపల్లెలో బెల్టుషాపులను నిర్వహించారు. ఈ విషయం అధికారులకు తెలిసిన విషయమే. వీటిని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎంత మద్యం సరఫరా చేసింది వివరాలు ఉన్న కాగితాలు దొరికాయని సమాచారం. దీనిద్వారా ఎకై ్సజ్‌ అధికారులు పూర్తిస్థాయిలో వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది.

బెల్టుషాపుల మూత

నకిలీమద్యం తయారీ వ్యవహారం వెలుగులోకి రా వడంతో తంబళ్లపల్లె నియోజకవర్గంలో బెల్టుషాపులు మూతపడ్డాయి. శుక్రవారం జరిగిన దాడులతో నకిలీమద్యం కేసు తమకు చుట్టుకుంటుందన్న ఆందోళనతో బెల్టుషాపులను మూసివేయడమేకాక నిర్వాహకులు మొబైల్‌ఫోన్ల స్విచ్చాఫ్‌ చేశారు. విక్రయాల్లో కీలకంగా వ్యవహరించే కొందరు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

దొరికిన లెక్కల ఆధారంగా ఎకై ్సజ్‌పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రమేయం ఉన్న విక్రయదారులను గుర్తించి చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఆదివారం నకిలీమద్యంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలు తంబళ్లపల్లె నియోజకవర్గంలో దాడులు నిర్వహించాయి. దీంతో నియోజకవర్గమంతటా దీనిపై చర్చ జరిగింది. తమ ప్రాంతంలో ఏకంగా నకిలీమద్యం కేంద్రం బట్టబయలు కావడం, ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో అన్న ఉత్కంఠ కనిపించింది. ఎక్కడైనా నకిలీమద్యం డంపులు ఉన్నాయా, వాటిని గుర్తించేందుకు ఆరా తీస్తున్నారు.

నకిలీ మద్యం.. టీడీపీదే పాపం 1
1/1

నకిలీ మద్యం.. టీడీపీదే పాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement