మదనపల్లె సిటీ : కొత్త టీచరత్లు అంకితభావంతో పని చేయాలని కడప డీఈఓ డాక్టర్ షంషుద్దీన్ అన్నారు. ఆదివారం స్థానిక చిత్తూరు రోడ్డులోని గ్రీన్‌వ్యాలీ స్కూల్‌లో నూతనంగా ఎంపికైన టీచర్ల శిక్షణా కార్యక్రమా న్ని సందర్శించారు. శిక్షణను సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. క్లాస్‌రూములు సందర్శించి తనదైనశైలిలో కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులు పాఠశాలలో నిర్వర్తించాల్సిన విధుల గురించి, వ్యాయామ ఉపాధ్యాయుల ప్రాముఖ్యత గురించి వివరించారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రెడ్డి,రిసోర్సుపర్సన్లు రెడ్డిశేఖర్, శివశంకర్‌రెడ్డి, నరేంద్ర, నాగరాజరెడ్డి, కోర్సు డైరెక్టర్లు పాల్గొన్నారు.