
కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం
రైల్వేకోడూరు అర్బన్: కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతోందని, ములకల చెరువులో అక్రమ మద్యం, మిషనరీలు పట్టివేతే ఇందుకు నిదర్శనమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్యే కొరముట్లశ్రీనివాసులు విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దశల వారీగా మద్యనిషేధం చేయడానికి బెల్ట్‌షాపులన్నీ రద్దు చేసి పరిమితంగా షాపులు నిర్వహిస్తే చంద్రబాబు వచ్చాక మద్యమే ప్రభుత్వానికి, వారి నాయకులకు ఆదాయ వనరులుగా చేశారని విమర్శించారు. ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ... చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ ఇన్‌చార్జికి సంబంధించిన వ్యక్తి నకిలీ మద్యం తయారు చేయడానికి చిన్నపాటి పరిశ్రమనే పెట్టుకొన్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఉందో దాని వెనకాల ఎవరు ఉన్నారో విచారించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇంత జరుగుతున్నా వ్యవస్థలు, యంత్రాంగం ఏమి చేస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు చెప్పే మాటలు దేశాలు, ఖండాలు దాటిపోతుంటాయి. కానీ అభివృద్ధి మాత్రం గుండుసున్నా అని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఎరువులు విత్తనాలు అందుబాటులో లేవు. అయితే కల్తీ మద్యం యథేచ్ఛగా దొరుకుతోందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రత్నమ్మ, పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు వెలగచర్ల శివప్రసాద్‌రెడ్డి, సీహెచ్‌రమేష్, మందలనాగేంద్ర, శంకరయ్య, రాజ, మహేష్, నందాబాల, సిధ్దు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు