
ఆటంకాలు తొలగేలా.. ఆటలో మెరిసేలా..!
రాజంపేట : కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో నుంచి కిలోమీటర్ దూరం ఈదరపల్లె ఎస్టీకాలనీకి సమీపంలో నందలూరు సౌమ్యనాథాలయ రథం దారిలో ఐదు ఎకరాలను మహమ్మద్‌షేక్ పదేళ్లకు లీజుకు తీసుకున్నారు. దానిని క్రికెట్ స్టేడియంగా రూపొందిస్తున్నారు. క్రికెట్ శిక్షణ టోర్నమెంట్‌కు అవసరమైన రీతిలో ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడాలేని నెట్, గ్రౌండ్ ఉండే విధంగా క్రికెట్ మైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. తన స్థాయి ఎంత కష్టమైనా సరే..అన్నట్లుగా దాదాపు రూ.25 లక్షల వ్యయంతో తొలుత మైదానం చదును, మైదానంలో క్రికెట్ ఆటగాళ్లకు అనువైన రీతిలో గడ్డిని పెంచారు. బౌండరీలను ఏర్పాటు చేయడం, గ్యాలరీ తదితర క్రికెటర్లకు సదుపాయాలను కల్పించేందుకు అన్ని విధాలుగా తన ఇద్దరు కొడుకులు ఆదిల్, ఆసిఫ్‌లు, సమీప బంధువు క్రికెటర్ జాఫర్(స్టేట్‌ప్లేయర్)తో కలిసి రూపకల్పన చేస్తున్నారు.
క్రికెట్‌లో రాణించేందుకు...
క్రికెట్‌లో రాణించేందుకు క్రికెట్ మైదానంలో సకల సదపాయాలను కల్పించనున్నారు. హైస్టాండర్ట్ క్రికెట్ గ్రౌండ్, వన్ అండ్ వన్ కోచింగ్, సీనియర్ క్రికెటర్లతో శిక్షణ, రెగ్యులర్‌గా ఓపెన్ నెట్ సెషన్స్‌లు ఉంటాయి. తరచుగా ప్రాక్టీస్ మ్యాచ్‌ల ఏర్పాటు. టోర్నమెంట్ల నిర్వహణతోపాటు ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే విధంగా క్రికెటర్ ఫ్యామిలీ ముందుకెళుతోంది. వసతి పరంగా ఓపెన్ డార్మెంటరీ క్రీడాకారులకు ఇంటి భోజనం తరహాలో అందించడం, కామన్ టీవీ ఏరియా, నిరంతరం మంచినీటి సదుపాయం దశలవారీగా క్రికెట్ మైదానంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఉమ్మడి కడప జిల్లాలో
మ్యాచ్‌లకు క్రికెట్ క్రీడా మైదానం..
ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడాలేని విధంగా నెట్‌తోపాటు క్రీడామైదానం కలిగివుండటం వలన క్రికెట్ అసోసియేషన్లు నిర్వహించే మ్యాచ్‌ల నిర్వహణకు దోహదపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన రీతిలో మైదానాలు లేక అనేక మందిలో దాగివున్న క్రికెట్ నైపుణ్యాలు వెలికితీసేందుకు అవసరమయ్యే శిక్షణ, మైదానాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఇప్పుడు నందలూరులో ఏర్పాటు కాబోతున్న క్రికెట్ మైదానం ఎందరో క్రికెటర్‌లను ఈ దేశానికి, రాష్ట్రానికి అందజేస్తుందనే ఆశాభావం క్రీడాభిమానుల్లో వ్యక్తమవుతోంది.
తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో
క్రికెట్ మైదానం..
విజయవాడ తర్వాత క్రికెట్‌ర్స్ ఫ్యామిలీ నందలూరు క్రికెట్ క్రీడా మైదానంలో అంతర్జాతీయ స్థాయిలో స్టేడియం, పిచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ప్రప్రథమనే చెప్పవచ్చు. అంతర్జాతీయ క్రికెటర్స్ ఆడే మ్యాచ్‌లో వినియోగించే పిచ్ టర్ఫ్ వికెట్ విజిబిలిటీ ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం విశేషంగా క్రికెట్ క్రీడాభిమానులు చెప్పుకుంటున్నారు.
క్రికెట్ మైదానం ఎక్కడంటే..
కడప–రేణిగుంట జాతీయరహదారి మండల క్లాంపెక్స్ నుంచి కిలోమీటర్‌లో ఈదరపల్లె రహదారిలో క్రికెట్ క్రీడామైదానాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రశాంత వాతావరణంలో, చుట్టూ పంటపొలాలు, తోటలు ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రీడామైదానం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు క్రికెట్ క్రీడాకారుల దృష్టి దీనిపై పడింది. నందలూరు రైల్వేకేంద్రం నుంచి బస్టాండుకు చేరుకొని అక్కడి నుంచి మండల క్లాంపెక్స్‌కు మార్గంలో వెళ్లాలి. ఈదరపల్లె ఎస్టీ కాలనీ దాటిన తర్వాత నందలూరు సౌమ్యనాథస్వామి రథం దారిలో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
నందలూరులో సొంత నిధులతో
ఐదు ఎకరాల్లో క్రికెట్ మైదానం
విజయవాడ తర్వాత క్రికెట్‌లో
రాణింపునకు టర్ఫ్ వికెట్ పిచ్
అందుబాటులోకి అంతర్జాతీయ స్థాయి స్టేడియం
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మహమ్మద్ షేక్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వారు. నందలూరు బస్టాండులో
టీ దుకాణం కొన్ని దశాబ్దాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నారు. తన బిడ్డలు షేక్ ఆదిల్ హుసేన్, ఆసిఫ్‌లు క్రికెట్‌లో
రాష్ట్ర స్ధాయి వరకు వెళ్లారు. ఎలాగైనా జాతీయ స్థాయిలో భారత జట్టుకు ఆడాలనే బిడ్డల తపన, కృషి చూసిన తండ్రి తన బిడ్డలాగానే, తమ ప్రాంతం నుంచి క్రికెటర్లు మరికొందరు రాణించాలనే ఆలోచనతో క్రికెట్ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేశారు.

ఆటంకాలు తొలగేలా.. ఆటలో మెరిసేలా..!

ఆటంకాలు తొలగేలా.. ఆటలో మెరిసేలా..!