
దెబ్బతిన్న లోలెవల్ కాజ్‌వే వంతెన
సిద్దవటం : సిద్దవటంలోని పెన్నా నదిపై నిర్మించిన లోలెవల్ వంతెన గత కొంత కాలంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా దెబ్బతింది. ఆగస్టు నుంచి ఇటు కుందూ నదినీరు, వర్షాల కారణంగా వచ్చిన వరదనీటితో.. దాదాపు 2 నెలల నుంచి పెన్నానది లోలెవల్ వంతెనపై నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్నానది లోలెవల్ వంతెనపై నుంచి సిద్దవటం గ్రామానికి రూ.4 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో స్కీం వాటర్ పైపులైన్ ఏర్పాటు చేశారు. నీటి ప్రవాహానికి గురువారం ఒక్కసారిగా పెన్నానదిపై ఉన్న లోలెవల్ కాజ్‌వే కుంగిపోయింది. వంతెనపై ఏర్పాటు చేసిన వాటర్ పైప్‌లైన్ కూడా దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పెన్నానది లోలెవల్ వంతెనకు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.