
కిలో టమాట @ రూ..2
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో టమాటా రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. పంట చేతికొచ్చినా మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కిలో టమాటా ధర రైతులకు రెండు రూపాయలు మాత్రమే లభిస్తోంది. మదనపల్లి, గుర్రంకొండ, కలకడ, కలికిరి, రాయచోటి మార్కెట్‌లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోజురోజుకు పతనమవుతున్న ధరలతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కిలో టమోటా ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వ్యాపారులు వీటిని పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
● పతనమైన టమాట ధరలు
● తీవ్ర సంక్షోభంలో రైతులు

కిలో టమాట @ రూ..2

కిలో టమాట @ రూ..2