
రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ జట్టుకు మదనపల్లె విద్యార్థి ఎం
మదనపల్లె రూరల్: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ జట్టుకు పట్టణంలోని శ్రీ విద్యావికాస్ జూనియర్ కళాశాల విద్యార్థి వి.కార్తీక్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ ఇ.శివశంకర్, కోచ్ బాలాజీ తెలిపారు. బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వి.కార్తీక్‌ను, ప్రిన్సిపాల్, కోచ్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక్, ఎస్.జి.ఎఫ్ జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. భవిష్యత్తులో చక్కటి క్రీడా ప్రతిభ కనపరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై , మదనపల్లె ప్రతిష్టను దేశవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 6 నుంచి జమ్మూకాశ్మీర్‌లో జరిగే అంతరాష్ట్ర ఫుట్‌బాల్ పోటీల్లో కార్తీక్ ఏపీ జట్టుతరపున ఆడుతాడన్నారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎస్.రెడ్డెప్పనాయుడు, వై.గుణకర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.