
ఎంపీ మిథున్‌రెడ్డికి ఆహ్వానం
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణం అమ్మవారిశాలలో గురువారం జరిగే దసరా వేడుకల్లో పాల్గొనాలని ఎంపి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఆహ్వానించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధే సత్యనారాయణగుప్త, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బుధవారం ఎంపీని తిరుపతిలోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు అన్నపూర్ణ, మురళి, రమేష్, బొగ్గరపు రాజేష్, నరేష్, సత్య పాల్గొన్నారు.