
జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందాలి
నిమ్మనపల్లె : జీఎస్టీ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీడీఓ రమేష్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డివారిపల్లె, కొండయ్యగారిపల్లె పంచాయతీల్లోని సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...జీఎస్టీ శ్లాబులను కేంద్ర ప్రభుత్వం నాలుగు నుంచి రెండుకు తగ్గించడంతో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిందన్నారు. వీటి కారణంగా నిత్యావసర వస్తువులు, ప్రాణాధార ఔషధాలు, లైఫ్–హెల్త్–టర్మ్ బీమా పాలసీలు, విద్యాసామగ్రి, వ్యవసాయ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్, పాల ఉత్పత్తులు, బేబీకేర్, ఫర్టిలైజర్స్...ఇలా అనేకవస్తువులు తగ్గిన ధరలతో సామాన్యులకు లభిస్తాయన్నారు. జీఎస్టీ సంస్కరణలు, పౌరుల జీవితాలను మెరుగుపరుస్తాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, ఏఓ మంజుల, పంచాయతీ కార్యదర్శి గాయత్రి తదితరులు పాల్గొన్నారు.