
ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి
రాయచోటి : విజయదశమి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి ప్రజలకు సూచించారు. మంగళవారం ఆయన విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు ప్రకటన ద్వారా ప్రత్యేక భద్రత సూచనలు జారీ చేశారు. ఉత్సవ ఊరేగింపుల సమయంలో శాంతియుతంగా, క్రమబద్ధంగా పాల్గొనాలన్నారు. తోపులాట, అల్లర్లు వంటి ప్రమాదకర చర్యలు చేయరాదన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఊరేగింపు మార్గాలను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. శబ్ద పరికరాలు అనుమతించిన స్థాయిలోనే వినియోగించాలన్నారు. మద్యపానం, కత్తులు, కర్రలు, ఇతర ప్రమాదకర వస్తువులు పూర్తిగా నిషేధమన్నారు. ప్రతి పట్టణ, గ్రామంలో ఊరేగింపు మార్గాలపై ప్రత్యేక పోలీసు పహారా ఉంటుందన్నారు. విజయ దశమి పండుగ మన సంస్కృతి, ఐక్యత, ఆనందానికి ప్రతీక అన్నారు. ఈ పండుగను అందరూ సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ కోరారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి