
తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.21 కోట్లు
మదనపల్లె : పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు రూ.21.93 కోట్ల కేటాయించినట్లు జిల్లా ప్రజారోగ్య ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బి.సతీష్ కుమార్ అన్నారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో తాగునీటి సరఫరాపై గురువారం ఆయన సమీక్షించారు. పట్టణంలో ఎక్కడెక్కడ నీటి ఇబ్బందులున్నాయి? ఎలా సరఫరా చేస్తున్నారు? తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టణానికి అమృత్ పథకం కింద రూ.21.93 కోట్లతో తాగునీటి పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. చిప్పిలి సమ్మర్‌స్టోరేజ్ ట్యాంకుకు పనులు పూర్తిచేసి అక్కడినుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టణంలో రెండు, మూడు రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నామని, రాయచోటిలో మూడురోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో డీఈ శ్రావణి, ఏఈ రవీంద్రనాయక్, ఫిట్టర్లు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
డీపీహెచ్‌ఈవో సతీష్‌కుమార్