
గుట్టల్లో పారబోసిన షూలు స్వాధీనం
పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మంజూరైన షూలను మండల కేంద్రానికి సమీపంలోని బోడిగుట్ట వెనుక వైపున వ్యవసాయ పొలాల్లో గుట్టల నడుమ పారబోశారు. ఈ విషయంపై శుక్రవారం ‘సాక్షి’లొ ప్రచురితమైన ‘గుట్టల్లో గుట్టుగా విద్యార్థుల షూ’లు వార్తపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పారబోసిన షూలను స్వాధీనం చేసుకుని సమగ్రంగా విచారణ చేయాలని డీఈఓ కె.సుబ్రమణ్యంకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డీఈఓ నేతృత్వంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి (సీఎంవో) కరుణాకర్, స్థానిక ఎంఈఓ గౌస్‌పీర్,సీఆర్‌పీ నాగరాజుతో కలిసి షూలను గుట్టల నడుమ పారబోసిన స్థలాన్ని పరిశీలించారు. షూలను స్వాధీనం చేసుకుని మండల కేంద్రంలోని స్టాక్ పాయింట్‌లో భద్రపరిచారు. వీటిని ఎవరు పారబోశారనే విషయంపై సమగ్రంగా విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని సీఎంవో వెల్లడించారు.

గుట్టల్లో పారబోసిన షూలు స్వాధీనం