
అధికారులు నిబద్ధతతో పని చేయాలి
తంబళ్లపల్లె: సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయంలో అసెంబ్లీ నియోజకవర్గ తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వివిధ అంశాలపై నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శనివారం సాయంత్రంలోపు అధికారులు తమ నియోజకవర్గ స్థాయి సమస్యలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేసి, స్పెషల్ ఆఫీసర్లకు తప్పనిసరిగా పంపాలన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పైప్‌లైన్ ఎక్కడా డ్రైనేజీ లైన్‌తో కలిసిపోకుండా చూడాలన్నారు. అంతకుముందు మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి అమరనాథరెడ్డి, బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ పల్లవి పాల్గొన్నారు.
జీఎస్టీ తగ్గింపు వల్ల చేకూరే లబ్ధిపై
అవగాహన పెంచాలి
రాయచోటి: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ద్వారా జీఎస్టీ తగ్గించడంవల్ల చేకూరే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వివిధ అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్ నుంచి క లెక్టర్ నిశాంత్‌కుమార్, జేసీ ఆదర్శరాజేంద్రన్‌లు పాల్గొన్నా రు. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల ప్రజలకు చేకూరే లబ్ధిపై ఈ నెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ జిల్లా అధికారులకు సూచించారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్