
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా శివారెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పోతుల శివారెడ్డిని రాష్ట్ర కార్యదర్శి (కేంద్ర కార్యాలయం)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోతుల శివారెడ్డి చెన్నూరు మండలం ఓబులంపల్లెకు చెందిన నాయకుడు. గతంలో ఆయన ఐటీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందించారు.
రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్
ప్రెసిడెంట్‌గా సుదర్శన్‌రెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన జల్లా సుదర్శన్‌రెడ్డిని రాష్ట్ర లీగల్‌సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రాయచోటి జగదాంబసెంటర్: రైతులు ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ పేర్కొన్నారు. రాయచోటిలోని డీపీఎం కార్యాలయంలో శుక్రవారం రైతు సామాజిక సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం –2005పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చని తెలిపారు. సమాచార హక్కు చట్టం –2005 గురించి రైతులకు స్పష్టంగా తెలియజేశారు. డీపీఎం వెంకటమోహన్ పాల్గొన్నారు.
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రైతులు 4 వేల ఎకరాలలో పండ్ల తోటలను సాగు చేసినట్లు జిల్లా ఉపాధి హామీ పథక సంచాలకులు వెంకటరత్నం అన్నారు. శుక్రవారం రామాపురంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ నాలుగు వారాలకు సంబంధించిన బిల్లులు పది రోజుల్లో కూలీల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. అనంతరం చిట్లూరు గ్రామంలోని సప్‌లై ఛానల్‌ను, నల్లగుట్టపల్లి గ్రామంలో రైతులు వెంకటరమణ, వెంకటస్వామిలు సాగు చేసిన నిమ్మతోటలను ఆయన పరిశీలించారు. ఏపీఓ పెంచలయ్య, ఈసీ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా శివారెడ్డి