
ఇరువర్గాల ఘర్షణ
మదనపల్లె రూరల్ : ఇరు వర్గాల ఘర్షణలో నలుగురు వ్యక్తులు గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన వెంగం శంకరప్ప(45), భార్య వెంగం మల్లీశ్వరి(40) పొలం వద్ద ఉండగా, పక్క పొలానికి చెందిన దక్షిణం వెంకటరమణ కుమారుడు దక్షిణం రామకృష్ణ ఆమె వద్దకు వచ్చి మాట్లాడుతున్న ఫోన్ లాక్కున్నారు. ఆమె భర్త శంకర తన భార్య ఫోన్ ఎందుకు లాక్కున్నావు.. తరచూ ఎందుకు ఫోన్ చేస్తున్నావంటూ నిలదీశాడు. ఇంతలో అక్కడకు వచ్చిన శంకర తమ్ముడు వెంగం వెంకటరమణ(35), రామకృష్ణతో గొడవకు దిగాడు. దీంతో రామకృష్ణ తండ్రి వెంకటరమణ, కుటుంబసభ్యులైన జయపాల్, రామలక్ష్మమ్మ తదితరులతో కలిసి గొడవపడ్డారు. మాటా మాటా పెరగడంతో రామకృష్ణ తన కత్తితో శంకర తమ్ముడు వెంకటరమణపై దాడిచేయగా తలకు తీవ్రగాయమైంది. అంతేకాకుండా మరో వర్గంలోని దక్షిణం వెంకటరమణ సైతం గాయపడ్డాడు. ఇరువర్గాల్లో గాయపడిన వ్యక్తులను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తాలూకా పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇరువర్గాల ఘర్షణ