
హోంగార్డు కుటుంబానికి సహచరుల ఆర్థికసాయం
రాయచోటి : రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హోంగార్డు బి.ఈశ్వర్‌నాయక్ కుటుంబీకులకు ఎస్పీ ధీరజ్ కనుబిల్లి గురువారం ఆర్థికసాయం ఆర్థికసాయం అందజేశారు. మృతుని కుటుంబానికి అండగా నిలిచేందుకు అన్నమయ్య జిల్లా హోంగార్డులు ముందుకు వచ్చి ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఇలా వచ్చిన రూ.2,32 172ల చెక్కును ఎస్పీ కార్యాలయంలో మృతుడి కుటుంబసభ్యులకు ఎస్పీ అందజేశారు. సహచరులు కుటుంబానికి అండగా నిలవడం గొప్ప విషయమని ఎస్పీ అభినందించారు. పోలీసులు కేవలం చట్టాన్ని కాపాడేవారు మాత్రమే కారని, ఒకరికొకరు అండగా నిలిచే కుటుంబీకులు అన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాసులు, ఏఆర్‌ఎస్‌ఐ బాలాజీ, జూనియర్ అసిస్టెంట్ జయకుమార్, బాధిత కుటుంబ సభ్యులు, హోంగార్డులు పాల్గొన్నారు.