
మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి
మదనపల్లె రూరల్ : మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు మృతిచెందిన ఘటన పట్టణంలో గురువారం జరిగింది. టిప్పుసుల్తాన్ మైదానం సమీపంలో నివాసముంటున్న గంగిరెడ్డి భార్య వెంకటమ్మ(78) మిద్దైపె నుంచి కిందకు దిగుతూ జారి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడటంతో కుటుంబసభ్యులు వెంటనే బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సంబేపల్లె : మండలంలోని చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వీర్లరాజు (29) మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని ముదినేనివడ్డిపల్లెకు చెందిన వీర్ల రాజు రాయచోటి చిత్తూరు రోడ్డు పక్కన హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పంక్చర్‌షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే సొంత పనుల నిమిత్తం రాయచోటి నుంచి స్కూటర్‌లో తన గ్రామానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో నారాయణరెడ్డిపల్లెలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఎలాంటి సిగ్నల్ లేకుండా నిలబడిన లారీని ప్రమాదవశాత్తూ ఢీకొన్నాడు. రాజు అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పెద్ద దిక్కు చనిపోవడంతో కుటుంబీకులు బోరున విలపించారు.
యువకుడి ఆత్మహత్య
బి.కొత్తకోట : స్థానిక పీటీఎం రోడ్డుకు చెందిన గంగాధర్(33) విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తిరుపతిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందగా పోలీసులు విచారిస్తున్నారు. ఓ యువతితో ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతుండగా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
పవర్ బీఈతో
విద్యార్థులకు ఉపయోగకరం
చాపాడు : విద్యార్థులకు పవర్ బీఈ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎంతో ఉపయోగమని హైదరాబాద్‌కు చెందిన రేష్ యాప్ సాప్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్రతినిధి నాగేంద్ర అన్నారు. స్థానిక చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(సీబీఐటీ) కాలేజీ విద్యార్థులకు గురువారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ పవర్ బీఈ అనేది ఒక అడ్వాన్స్‌డ్ ఎక్స్‌వెల్ నేర్చుకోవడంతో విద్యార్థులకు వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయన్నారు. ఉగ్యోగాలు పొందాడానికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని, బిజినెస్‌లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఈ డేటా మార్గదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లోహిత్‌రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డా.జి.శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపల్ డా.ఎస్.శృతి పాల్గొన్నారు.

మెట్లపై నుంచి జారిపడి వృద్ధురాలు మృతి