
భర్త ఇంటి ముందు ధర్నా
నందలూరు : మండలంలోని పాటూరు గ్రామంలో భర్త ఇంటి ముందు అతని భార్య ధర్నా చేసిన సంఘటన బుధవారం జరిగింది. ఆమె కథనం మేరకు ఓబులవారిపల్లి మండలం ఎల్లాయపల్లి గ్రామానికి చెందిన జయలక్ష్మీకి మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన కుంచం సురేష్‌తో దాదాపు 8 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు సంతానం. సురేష్ జీవనోపాధి నిమిత్తం గల్ఫ్‌లోని కతర్ దేశాలకు వెళ్లి వస్తూ ఉంటాడు. సురేష్ ఇతర దేశాల్లో ఉండటం వల్ల జయలక్ష్మీ తన పుట్టింట్లో ఉంటోంది. తన మామ ఆస్తి కావాలని సురేష్ గొడవ పెట్టుకుని సుమారు 6 నెలల నుంచి జయలక్ష్మీకి డబ్బులు పంపడం కానీ మాట్లాడటం కానీ చేయడం లేదు. నెల రోజుల క్రితం సురేష్ ఇంటికి వచ్చిన విషయం తెలిసి జయలక్ష్మీ భర్తకు ఫోన్ చేయగా ఆస్తిలో సగం భాగం తనకు ఇస్తేనే సంసారానికి తీసుకొని వస్తానని చెప్పి సురేష్ ఫోన్ పెట్టేశాడు. దీంతో జయలక్ష్మీ పాటూరు గ్రామానికి వచ్చి సురేష్ సోదరుడి ఇంటిముందు ధర్నాకు దిగింది ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరు. భార్యాభర్తల మధ్య గొడవ రావడానికి కారణం సురేష్ అన్న కుంచం గోపాలకృష్ణయ్య అని జయలక్ష్మీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.