
విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి జగదాంబసెంటర్ : విద్యుత్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జేఏసీ చైర్మన్ జాఫర్‌వలి, కన్వీనర్ నరసింహులునాయక్, కో చైర్మన్ నరేంద్రనాథరెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి విద్యుత్ కార్యాలయం ఎదుట జిల్లా జేఏసీ, రాయచోటి, రాజంపేట డివిజన్ జేఏసీల ఆధ్వర్యంలో విద్యుత్తు కార్మికులు, సిబ్బంది శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ రెడ్డప్పరెడ్డి, చంద్రశేఖర, జి.చంద్రశేఖర్, పాపయ్య, కె.వెంకటరమణ, మహేశ్వరయ్య, రియాజ్‌అహమ్మద్, సిబ్బంది పాల్గొన్నారు.