
ఎర్రచందనం దుంగలు పట్టివేత
ఎర్రచందనం దుంగలతో అటవీ అధికారులు
నిందితుడి అరెస్టు చూపుతున్న అటవీ అధికారులు
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు అటవీశాఖ పరిదిలోని కోడూరు రేంజ్ కేవీ భావి సౌత్ బీట్ వద్ద శుక్రవారం 24 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అధికారులు దాడులు చేసి పట్టుకొన్నారు. కోడూరు రేంజర్ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కూంబింగ్ జరుపుతుండగా తమిళనాడు రాష్ట్రం కూనీకత్తూర్‌కు చెందిన వెంకటేశన్ దుంగలు తరలిస్తూ కనిపించాడు. అటవీ అధికారులు అతడిని అరెస్టు చేసి రూ.2.22 లక్షల విలువచేసే 24 దుంగలు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది రమణ, మహేష్‌శంకర్, దామోదర్, పెంచలయ్య పాల్గొన్నారు.
తమిళనాడు వాసి అరెస్టు
పీలేరు : పీలేరు–యల్లమంద మార్గంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ గురు ప్రభాకర్ తెలిపారు. వివరాలిలావున్నాయి ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో పీలేరు – యల్లమంద మార్గంలో అటవీ అధికారులు శుక్రవారం వాహనాలు తనిఖీ చేశారు. ఒక వాహనంలో రూ. 8.24 లక్షల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒకరిని అరెస్టు చేసినట్లు డీఎఫ్‌వో తెలిపారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్‌వో చంద్రశేఖర్, ప్రకాష్‌కుమార్, ప్రతాప్, రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు.

ఎర్రచందనం దుంగలు పట్టివేత