కడప రూరల్ : వైద్య రంగాన్ని ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని చూస్తే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. స్థానిక ఐఎంఏ హాల్‌లో ప్రభుత్వ విద్య ప్రైవేటీకరణ..లాభ–నష్టాలు అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల ద్వారా విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు సేవలందించడం ద్వారా వైద్య రంగంలో మెలకువలు తెలుసుకునేందుకు పేద విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేసే పీపీపీ విదానాన్ని ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో వ్యతిరేకించారని తెలిపారు. రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలలుండగా, ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం తగదన్నారు. 66 ఏళ్లకు కోట్ల రూపాయల ఆస్తులను రూ.5వేలకు లీజుకు ఇవ్వడం శోచనీయమని తెలిపారు. డాక్టర్ నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రైవేటుపరం చేయడం ద్వారా సీట్లను అమ్ముకుని వైద్య విద్యను వ్యాపారం చేయడమేనని తెలిపారు. డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిలో వ్యతిరేకిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివారెడ్డి, డాక్టర్ పెంచలయ్య, డాక్టర్ సామేల్ తదితరులు పాల్గొన్నారు.
పులివెందులలో అన్ని హంగులతో మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. ఈ కాలేజీలు ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. ప్రైవేటీకరణతో విద్యాబోధన సక్రమంగా ఉండదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ ఎస్.గౌస్‌పీర్, కడప
రోగులకు సేవలందించే కీలకమైన వైద్య విధానంలో రాజకీయాలు తగవు. ఏవైనా నిర్ణయాలు తీసుకునేటపుడు వైద్యులు, ఇతర విద్యార్థులు, తదితర సంస్థలకు, ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేలా పాలకులు చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ రామచంద్రయ్య, కడప
వైద్య విద్యను ప్రైవేటుపరం చేయడం ద్వారా అవినీతి ముసుగు ఉంది. వైద్యులతోపాటు కీలకమైన పారా మెడికల్ స్టాఫ్‌ను పెంచాలి. కడపలో కేన్సర్ ఆస్పత్రి ఉంటే ప్రభుత్వం ఇంతవరకు అక్కడ సిబ్బంది, సౌకర్యాలను కల్పించకపోవడం శోచనీయం.
– డాక్టర్ రాంగోపాల్‌వర్మ, కడప
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా ప్రయోజనకరంగా ఉండాలి. వైద్య విద్య కాలేజీల ప్రైవేటుపరం చేయడంతో సిబ్బందితోపాటు మౌలిక సదుపాయాలు ఉండవు. అలాగే అక్కడికి వచ్చే రోగుల ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. – డాక్టర్ బాలిరెడ్డి, కడప
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం
వైద్య విద్యను ప్రైవేటీకరించడం ప్రమాదం