
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : కు క్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండ పంచాయతీ డ్రైవర్స్ కాలనీకి చెందిన మహేష్, గంగోత్రిల కుమారుడు తరుణ్(4) ఇంటి వద్ద ఆడుకుంటుండగా, వీధికుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడిచేశాయి. దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆలయ స్థలాలను
పరిరక్షించుకుంటాం
చిట్వేలి : ఆలయ స్థలాలను పరిరక్షించుకుంటామని చిట్వేలి సోమేశ్వరాలయం కమిటీ చైర్మన్ వీరాంజ నేయులు, ఆర్గనైజర్ బొంతల నాగేశ్వరరావు, సభ్యులు మోహన్ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ధర్మనిధి అఖండ సభ్యుల ఆధ్వర్యంలో శివాలయం ఆవరణంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని శుక్రవారం ఎక్సలేటర్లతో చదును చేయించారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ అక్రమణకు గురైన స్థలాన్ని స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ వేసి పరిరక్షించుకుంటామన్నారు. ఎవరైనా స్థలాల ఆక్రమణకు పాల్పడితే సహించమన్నారు. ఈ కార్యక్రమంలో శివ, నాని, కొనిశెట్టి సుబ్బరాయుడు, కడుమూరి రమణయ్య, నవీన్, తేజ, మణి, సురేంద్ర, నరసింహ, వెంకటరత్నం, ,సాయి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
252 రేషన్ బియ్యం బస్తాల స్వాధీనం
రాజంపేట రూరల్ : అక్రమంగా తరలించేందుకు మండలంలోని మిట్టమీదపల్లి గ్రామంలో ఉంచిన 252 రేషన్ బియ్యం బస్తాలను రెవెన్యూ అధికారులు బుధవారం గుర్తించారు. రాత్రి వరకు గోప్యంగా ఉంచి అనంతరం అసంపూర్తిగా ఉన్న ప్రెస్‌నోట్ విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఒక రోజే అటు 309 బస్తాలు లారీలో లభ్యం కావడం, ఇటు నిల్వ వుంచిన 252 బస్తాలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
పే కమిషన్ సభ్యుల
పేర్లు ప్రకటించాలి
నందలూరు : 8వ పే కమిషన్ కమిటీ సభ్యులను కేంద్రం ప్రభుత్వం ప్రకటించాలని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యదర్శి విశ్వనాథ్ అన్నారు. రైల్వే కార్మికులతో కలిసి శుక్రవారం ఆయన నిరసన తెలిపారు. విశ్వనాథ్ మాట్లాడుతూ జనవరిలో 8వ పే కమీషన్ వేస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పేర్లను ప్రకటించకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే తక్కువ జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం, ఆకులనాగరాజు, సాయి సందీప్, షేక్షావలి, సయ్యద్ గయాజ్, విశ్వదీపక్, శ్రీహర్ష, పి.రాజు, భరత్, లెనిన్ బాబు, పి.వెంకటేశ్వర్లు, అరుణ్‌కుమార్, సుశీల్‌కుమార్, కార్మికులు పాల్గొన్నారు.
మదనపల్లె రూరల్ : నీళ్లు అనుకుని టర్పెంట్ ఆయిల్ తాగి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. కర్నాటకకు చెందిన సాదియా తన కుమార్తె అలీజా(2)తో కలిసి పట్టణంలోని సైదాపేటలో నివాసముంటోంది. నీరుగట్టువారిపల్లెలోని రీలింగ్ కేంద్రంలో పనులు చేస్తూ జీవిస్తోంది. శుక్రవారం పని ప్రదేశానికి కుమార్తెను తీసుకువెళ్లింది. ఆమె రీలింగ్‌కేంద్రంలో పనులు చేస్తుండగా, చిన్నారి ఆడుకుంటూ దప్పిక అవడంతో టర్పెంట్ ఆయిల్‌ను నీరు అనుకుని తాగింది. తీవ్ర అస్వస్థతకు గురికాగా, సాదియా, చిన్నారిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చింది. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. మార్గ మధ్యంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.
మృతిచెందిన చిన్నారి అలీజా, టర్పెంట్ ఆయిల్ బాటిల్

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు