
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలి
రాజంపేట : రాజంపేట నియోజకవర్గ సమగ్ర అబివృద్దికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది నిబద్ధతో పనిచేయాలని కలెక్టర్ నిశాంత్‌కుమార్ అన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో సమస్య గుర్తించి పరిష్కరించే విధంగా పాలన సాగాలని పేర్కొన్నారు. చెత్త సేకరణ, ప్రజారోగ్యంపై మున్సిపల్ కమిషనర్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నీటి సరఫరాపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం పంటలు, వాటి విస్తీర్ణం వివరాలు వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ హెచ్.భావన, రాజంపేట నియోజకవర్గ ఎంఆర్‌ఓలు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.