
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని తెలిపారు.బుధవారం మండలంలోని చింతరాజుపల్లి పంచాయతీలోగల చింతరాజుపల్లి హరిజనవాడ, గాండ్లపల్లి గ్రామాలలో విష జ్వరాలు, కీటక వ్యాధులపై మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ ఐ సుబ్బరాయుడు, మండల వైద్యాధికారి డాక్టర్ భావనతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేశారు. ఇంటింటికి తిరిగి లార్వా, వైరల్ జ్వరాల సర్వే నిర్వహించారు. అక్కడ అనారోగ్యంతో బాధఫడుతున్న కొంతమందికి విష జ్వరాలకు సంబంధించి రక్త పరీక్షలు చేయగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్ద మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మలేరియా అధికారు పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ జి భాస్కర్ రెడ్డి, ఏ లక్ష్మీనరసమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్ కరిమున్నీషా, ఎ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.