
నివేదనలే..పరిష్కారం లేదు
ఆన్‌లైన్ కోసం తిరుగుతున్నా!
సమస్య పరిష్కరించాలి
ఇంటి బిల్లు మంజూరు చేయాలి
తనకు ప్రభుత్వం ఇంటి పట్టా మంజూరు చేసింది. అప్పు చేసిన పునాది వేసి వేసుకున్నాను. అందుకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయలేదు. కళ్లు సరిగా కనిపించకున్నా 6నెలలుగా తిరుగుతున్నాను. సత్వరమే బిల్లు మంజూరు చేయాలి. – రెడ్డెప్ప,
గుట్టపల్లిసోమవరం, సంబేపల్లె మండలం
● ఎంతో ఆశతో కలెక్టరేట్‌కు వస్తున్న
బాధితులకు జరగని న్యాయం
● ప్రజా వేదికకు భూములకు సంబంధించిన ఫిర్యాదుదారుల అధికం
సాక్షి రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరుగులు పెడుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారం అండగా...ఆగడాలు మెండుగా...జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూర్చొనేందుకు కూడా బరువుగా భావిస్తుండడంతో బాధితులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా తల్లడిల్లిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు న్యాయం మాత్రం కొండంత దూరంలో కనిపిస్తోంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వచ్చి గోడు వెళ్లబోసుకునేందుకు బారులు తీరుతున్నారు. ప్రతిసారి వచ్చినవారే మళ్లీమళ్లీ వస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నారు. కొత్త కలెక్టర్ రాకతోనైనా తమ సమస్యలు తీరుతాయని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
న్యాయం కోసం
జిల్లాలోని అటు తంబళ్లపల్లె, ఇటు రైల్వేకోడూరు, మదనపల్లె, రాజంపేట ఇలా చెబుతూపోతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలెక్టరేట్‌కు కదులుతున్నారు. కానీ పెన్షన్లు, ఇతరత్రా చిన్నపాటి సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం గగనంగా మారుతోంది. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి ఆన్‌లైన్, అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్థలాలను విడిపించమని, ఇతరత్రా దాడులు, వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. దివ్యాంగులు, వృద్దులు, ఇ తర వ్యక్తిగత సమస్యలతో ప్రతి సోమవారం 250– 300 మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా ఇంటి ప ట్టా, ఆన్‌లైన్ సమస్యలు, భూ కబ్జాలు, ఉద్యోగాలు, రుణాల కోసం, పరిహారం ఇలా అనేక సమస్యలతో కలెక్టరేట్‌కు న్యాయం కోసం వస్తున్నారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికకు సంబంధించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా డుమ్మా కొడుతుండడం.....కిందిస్థాయి సిబ్బందిని కార్యక్రమానికి పంపుతుండడంతో సమస్యల పరిష్కారం గగనంగా మారింది.
కొత్త కలెక్టర్‌పైనే ఆశలు
జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు భారీగా బాధితులు వస్తున్నా న్యాయం జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్‌తోపాటు కొంతమంది అధికారులు సమస్యల పరిష్కారంలో కొంతమేర కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్‌కుమార్‌పై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ ఆక్రమణలతోపాటు రెవెన్యూలో ఆన్‌లైన్, దాడులతో బెంబేలెత్తించడం, ఇతరుల భూములు లాక్కొవడం, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం ఎక్కువైంది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలై మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా చేశారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధముతున్నారు. కలెక్టర్ నిశాంత్‌కుమార్ అనేక వ్యవహారాలపై మార్పునకు కృషి చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు.
టమాట, బొప్పాయికి
గిట్టుబాటు ధర కల్పించాలి
టమాట, బొప్పాయికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. మార్కెట్‌లో దళారీ వ్యవస్థ కారణంగా అన్నదాతలు మోసపోతున్నారన్నారు. టమాట, బొప్పాయి పండ్లను మార్కెట్‌కు తీసుకెళ్లినా అమ్ముడుపోక రోడ్లమీద పారవేయాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో ఆత్మహత్యల వరకు పరిస్థితులు వెళుతున్నాయి. ఇప్పటికై నా రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు.
నా పేరు సఫియాబీ. పీలేరు మండలం జాండ్ల గ్రామానికి చెందిన తనకు 1.5 ఎకరాల భూమి ఉంది. ఆన్‌లైన్‌కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాను. పీలేరు తహసీల్దార్ పట్టించుకోవడం లేదు. నేను లేని సమయంలో మా పక్క భూమి వాళ్లు ఆన్‌లైన్ చేసుకున్నారు. జరిగిన తప్పును గుర్తించి తనకు న్యాయం చేయాలి.
నా పిత్రార్జితం వారసత్వ రీత్యా లభించిన భూమికి సంబంధించి 1బీ అడంగల్, పాసు పుస్తకం మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఫలితం లేదు. నాసమస్యను సత్వరమే పరిష్కరించాలి. – డి.సుధాకర్, బూర్లపల్లి కస్పా,
పెద్దతిప్పసముద్రం మండలం

నివేదనలే..పరిష్కారం లేదు

నివేదనలే..పరిష్కారం లేదు

నివేదనలే..పరిష్కారం లేదు