
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ పరిధిలోని కాటిమాయకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అజ్మత్ ఆలీ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు.ఈ నెల 12వ తేదీ కడప డీఎస్‌ఏ స్టేడియంలో ఎస్‌జీఎఫ్ అండర్–14 విభాగంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలో ఎస్. అజ్మత్ అలీ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. పీడి రమేష్ నాయక్‌ను కూడా ప్రధానోపాధ్యాయుడు అభినందించారు.
పోస్టర్ ఆవిష్కరణ
రాయచోటి : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నిర్వహించే జాతీయ పశు వ్యాధి నివారణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పిలుపునిచ్చారు. గాలికుంటువ్యాధికి ఇంటి వద్దనే పశువులకు టీకాల పంపిణీ జరుగుతుందని జేసీ తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్‌ను జేసీ ఆవిష్కరించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్‌పిళ్‌లై, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షల్లో ప్రతిభ
– ఒకే సారి రెండు ఉద్యోగాలకు ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు కడపకు చెందిన మేకల గురు గోవర్ధన్ యాదవ్. తన మొదటి ప్రయతనంలోనే ఒకేసారి టీచర్ ఉద్యోగంతోపాటు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన లక్ష్యం వైపు ప్రణాళికతో ముందుకు సాగి విజయం సాధించాడు. మేకల గురు గోవర్ధన్ యాదవ్,76.436 మార్కులతో 200 ర్యాంకుతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు.మా అమ్మగారి కోరిక మేరకు శ్ఙ్రీకష్టపడి చదివి టీచర్ ఉద్యోగం సాధించినట్లు గోవర్థన్ తెలిపారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూనే తీరిక సమయంలో గ్రూప్–1 చదువుతానని పేర్కొన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక