
17 నుంచి స్వస్థ నారీ సశక్త్ అభియాన్
రాయచోటి టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమశాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ కె. లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ని వైద్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యాధికారులందరూ సమన్వంతో పని చేయాలని సూచించారు.