
జేఎన్టీయూ వాచ్‌మెన్ మృతి
కలికిరి : రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న వాచ్‌మెన్ హరినాథ్(47) మృతిచెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిమ్మారెడ్డిగారిపల్లికి చెందిన హరినాథ్ జేఎన్టీయూ కళాశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం కళాశాల నుంచి సొంత పని నిమిత్తం స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో చింతలవారిపల్లి బస్టాపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో హరినాథ్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆటోలో కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
పుల్లంపేట : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పుల్లంపేట శ్రీరాములుపేటకు చెరందిన శివ, మణి ద్విచక్ర వాహనంలో చిట్వేలి నుంచి తమ గ్రామానికి వెళ్తున్నారు. దిగువపల్లి సమీపాన రోడ్డు ప్రక్కన ఉన్న కంచెను ఢీకొని కింద పడ్డారు. శివ, మణిలకు తీవ్ర గాయాలవగాయ్యా పోలీసులు రాజంపేట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యంకోసం రాజంపేట నుంచి తిరుపతికి తరలించారు.

జేఎన్టీయూ వాచ్‌మెన్ మృతి

జేఎన్టీయూ వాచ్‌మెన్ మృతి