
కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం
రాయచోటి : తిరుపతి పట్టణంలో రాష్ట్ర మంత్రి సవిత చౌదరి ఆధ్వర్యంలో అక్టోబర్ 5న జరిగే కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కురబ సంఘం సభ్యులు, నాయకులు ప్రకటించారు. రాయచోటిలోని అజయ్ కల్యాణ మండపంలో కురబసంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కురవ, కురబ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో కురబ కులం పేరు చెప్పుకుంటూ తన భర్త వెంకటేశ్వరచైదరిని పదవిని కాపాడుకునే ప్రయత్నం మంత్రి సవిత చేయడాన్ని తాము ఒప్పుకోమన్నారు. కురబలు సహకరించకపోతే సంఘం నాయకులనే మార్చేస్తామని హెచ్చరించడం తగదన్నారు. అధికారంకోసం ప్రగల్బాలు పలుకుతూ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహావిష్కరణను బహిష్కరించాలని కురబ సంఘం ఏకపక్షంగా తీర్మానించిందన్నారు. అలాగే అక్టోబర్ 12న విజయవాడలో నిర్వహించనున్న సమావేశంలో కురబలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెపర్డ్ జిల్లా కురమ, కురబ, కురవ అధ్యక్షుడు, కె.రవిశంకర్, జిల్లా కురవ సంఘం అధ్యక్షుడు తరిగొండఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కప్పల రాజన్న, జిల్లా కోశాధికారి గోవిందు సుధాకర్, గుడి రామానుజులు, గుడిశ్రీనివాసులు, గౌనుపల్లి రెడ్డన్న, మంగిరి రమణ, బోనే మురళీ కుమార్, మంగిరి సురేష్, గుడి శివ, రవీంద్ర, శ్రీనివాసులు, రవి, చెన్న కృష్ణయ్య, నాగయ్య, గోవిందు, దనార్జన, రఘు, గిరి, మంచూరి అంజి తదితరులు పాల్గొన్నారు.