
బాబు మాటలకు అర్థాలే వేరులే..
రాయచోటి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు అర్థాలే వేరు అని లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయలేదంటూనే కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న వైనంపై రమేష్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేదొకటి ప్రజలకు చెప్పేది ఒకటి అన్నారు.
వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు మంజూరైన విషయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకుంటూనే మరోవైపు స్థలాలు కేటాయించినంత మాత్రాన అభివ్దద్ది కాదని అబద్ధాలు చెప్పడం తగదన్నారు. మెడికల్ కళాశాలల నిర్వహణ చేతగాకనే పిపిపి ముసుగుతో ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. పేద, మద్యతరగతి పిల్లల విద్యా బోధనకు, ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి పనిచేశారని, చంద్రబాబు నాయుడు మాత్రం విద్య, వైదాన్ని కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఇంత భారీ స్థాయిలో మూటకట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కూటమి పాలనలో అవినీతి దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమార్చన, రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి