
కూలీల ఆటో బోల్తా
కురబలకోట : కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..కురబలకోట మండలం ముదివేడులో టమాటాలు కోసేందుకు మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన కూలీలు జె.శ్రీనివాసులు (38), రమణమ్మ (50), సరస్వతి (48), రామసుధ (29), లక్ష్మి దేవి (35), ఎం.శ్రీనివాసులు (40), రవనమ్మ (40) ఆటోలో బుధవారం ఉదయం బయలు దేరారు. ముదివేడు దగ్గరగా వెళుతుండగా కృష్ణారెడ్డిగారిపల్లె వద్ద ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్‌ను తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలోని కూలీలంతా కిందపడి గాయపడ్డారు. వారిని 108లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వాహనంపై నుంచి పడి.. మరొకరికి
మదనపల్లె రూరల్ : వాహనంపై నుంచి పడి ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నక్కబండ్లకు చెందిన దస్తగిరి కుమారుడు అసిఫ్(28), స్థానికం మండీలో పనిచేస్తున్నారు. ఐచర్ వాహనంలో మదనపల్లె నుంచి వెళ్తుండగా.. బైపాస్ రోడ్డులోని రాయల్ ఫర్నిచర్ సమీపంలో మరో కారు అకస్మాత్తుగా అడ్డుగా వచ్చింది. కంగారుపడ్డ ఐచర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనంపై కూర్చున్న ఆసిఫ్ అదుపుతప్పి పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరుకు తీసుకువెళ్లారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఎనిమిది మందికి గాయాలు