ప్రతిభకు ఉపకారం | - | Sakshi
Sakshi News home page

ప్రతిభకు ఉపకారం

Sep 11 2025 2:44 AM | Updated on Sep 11 2025 2:44 AM

ప్రతి

ప్రతిభకు ఉపకారం

పరీక్ష విధానం

మదనపల్లె సిటీ: ప్రభుత్వ బడుల్లో గ్రామీణ,పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుతుంటారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభు త్వం ఉపకారవేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ఇందుకు ఏటా నేషనల్‌ మీన్స్‌ కం మెరిట్‌ స్కాలర్‌షిప్‌(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో అర్హత సాఽధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం అందుతుంది. దరఖాస్తుకు ఈనెల 4నుంచి 30వ తేదీ తుది గడువు విధించారు. పరీక్ష డిసెంబర్‌ 7వతేదీ నిర్వహిస్తారు.

ఎవరు అర్హులు: ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7 వ తరగతిలో ఓసీ,బీసీలైతే 55 శాతం, ఎస్సీ,ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమాన మైన గ్రేడ్‌ పొందిన వారు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠవాలల్లో రెగ్యులర్‌గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్‌ పాఠశాలలలు ,రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు WWW.bse.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఏడాదికి రూ.12 వేలు

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు ఈ పారితోషకానికి ఎంపికై తే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకారవేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు ఇవ్వనున్నారు.విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు.

రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని విభాగాల వారీగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఇందులో రెండు ప్రశ్నపత్రాలలు ఉంటాయి. మూడు గంటల పాటు పరీక్ష సమయాన్ని కేటాయించారు.

మెంటల్‌ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్‌, నాన్‌ వెర్బల్‌, రీజనింగ్‌ నుంచి 90 ప్రశ్నలుంటాయి. దీనికి 90 మార్కులు

స్కాలిసిస్‌ అప్టిట్యూట్‌ పరీక్ష: ఇందులో 7,8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య,సాంఘిక విషయాలపై ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 180 మార్కులు.

ఎన్‌ఎంఎంస్‌ పరీక్షకు వేళాయె

సెప్టెంబర్‌ 30 వరకు దరఖాస్తు స్వీకరణ

ప్రశ్నపత్రాలు సాధన చేయాలి

జాతీయ ఉపకార వేతనాల పోటీ పరీక్ష పేద,మధ్య తరగతి విద్యార్థులకు వరం. 7,8 తరగతుల విషయాలతో పాటు రీజనింగ్‌ కోసం మాదిరి ప్రశ్నాపత్రాలు సాదన చేయాలి. –పురం రమణ, టీచర్‌,

వివేకానంద మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, మదనపల్లె

సద్వినియోగం చేసుకోవాలి

ప్రధానోపాధ్యాయులు ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి, వారితో దరఖాస్తు చేయించడమే కాకుండా పరీక్ష రాసేలా ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు ప్రత్యేక సమయాన్ని కేటాయించి పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి

ప్రతిభకు ఉపకారం 1
1/3

ప్రతిభకు ఉపకారం

ప్రతిభకు ఉపకారం 2
2/3

ప్రతిభకు ఉపకారం

ప్రతిభకు ఉపకారం 3
3/3

ప్రతిభకు ఉపకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement