
నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలి
ములకలచెరువు: సహజ ఎరువులు, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ములకలచెరువు మండలం సోంపల్లెలో నానో ఎరువులు, జీవన ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా ఎక్కువగా వినియోగించడం వల్ల భూసారాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు నష్టాన్ని కలుగజేస్తుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టఽర్ చల్లా కల్యాణి, తహసీల్దారు ప్రదీప్, ఎంపీడీఓ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటా చెత్త సేకరణ
ఇంటింటా చెత్త సేకరణ క్రమ తప్పకుండా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మండలంలోని సోంపల్లె పంచాయతీలో చెత్త నుంచి సంపద సృష్టి తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు.