
భారీ ర్యాలీ
కడప – చిత్తూరు జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ సురేష్‌బాబు, పీలేరు, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్ కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, పుంగనూరు, మదనపల్లె పరిశీలకురాలు అనీషారెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఎర్రంరెడ్డి ఆరంరెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు కదిలి వచ్చాయి. జెండాలను చేతబూని, ప్లకార్డులతో మెరుపు వేగంతో దూసుకొచ్చారు. ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే ప్లకార్డులు పట్టుకుని చేస్తున్న నినాదాలు హోరెత్తాయి. యూ రియా కొరతను నివారించాలని, రైతులకు వెంటనే సబ్సిడీపై ఎరువులను అందించడంతోపాటు పండ్ల తోటల రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.