
రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలి
రాయచోటి : ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే విషయంలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని డీఆర్‌ఓ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో డీఆర్‌ఓ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (డీఆల్‌ఆర్‌సీ) బ్యాంకర్స్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్ రంగం భాగస్వామ్యం కావాలన్నారు. స్వయం ఉపాధికోసం రుణాల అందజేతకు చర్యలు, వ్యవసాయానికి పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల చేరికను పెంచడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించాలని డీఆర్‌ఓ సూచించారు.కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఆర్‌బీఐ ఎల్‌డీఓ వీన్ కుమార్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కోటిరెడ్డి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, నాబార్డు డీడీఎం విజయ విహారి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ బాషా, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రాజమణి తదితరులు పాల్గొన్నారు.
జాబ్‌మేళా పోస్టర్ ఆవిష్కరణ
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం డీఆర్‌ఓ మధుసూదరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ భరత్‌కుమార్, జీఎస్‌డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జునతో కలిసి మెగా జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో రాయచోటిలోని శ్రీ శివ నర్సింగ్ కాలేజీలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9550104260, 9177143181, 8897776368 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.