
విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ
www. inspireaawards. gov. in వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబర్ 15 తేదీలోపు పాఠశాల విద్యార్థులు వారి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషికం అందిస్తారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్‌స్పైర్ మనాక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ ,జపాన్ సందర్శన అవకాశాలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్సు అధికారులను సంప్రదించాలి.
మదనపల్లె సిటీ: బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇన్‌స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్‌స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది.
ఏటా నిర్వహణ
కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వారు ఏటా ఇన్‌స్పైర్ అవార్డ్స్ మనాక్ పోటీలను నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ,రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఇన్‌స్పైర్ మనాక్ పోటీలకు విద్యార్థుల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో 304 ఉన్నత, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశముంది. జిల్లాలో ఇప్పటి వరకు 1120 నామినేషన్లు వచ్చాయి. రాష్ట్రంలోనే జిల్లా ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉంది.
దరఖాస్తు చేసుకునే విధానం
తొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివవరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబర్, ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి,సంబంధిత రైటప్ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతను సంబంధించి అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వతేదీ వరకు గడువు ఉంది.
జిల్లా స్థాయిలో జరిగిన ఇన్‌స్పైర్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్న డీఈఓ,అధికారులు (ఫైల్), జాతీయ స్థాయికి ఎంపికై న జిల్లా విద్యార్థి ప్రశంసాపత్రం అందకుంటున్న దృశ్యం (ఫైల్)
2022–23 జిల్లా స్థాయికి
ఎంపికై నవి: 245
రాష్ట్ర స్థాయికి
ఎంపికై నవి: 21
జాతీయ స్థాయికి
ఎంపికై నవి: 2
2025–26 ఇప్పటి వరకు 1120 నామినేషన్లు వచ్చాయి.
జిల్లా ఇన్‌స్పైర్ మనక్ వివరాలు
2023–24
నామినేషన్లు: 2700
జిల్లా స్థాయికి
ఎంపికై నవి: 326
రాష్ట్ర స్థాయి: జరగాల్సి వుంది
జాతీయస్థాయి: జరగాల్సి వుంది
2024–25
నామినేషన్లు: 2350
జిల్లా స్థాయికి
ఎంపికై వనవి: 246
రాష్ట్ర స్థాయి: జరగాల్సి వుంది
జాతీయ స్థాయి: జరగాల్సి వుంది
ఇన్‌స్పైర్ మనక్ నామినేషన్ల
నమోదుకు గడువు పెంపు
బాల శాస్త్రవేత్తలను ప్రోత్సహిద్దాం
చిన్న వయస్సులోనే విద్యార్తులను పరిశోధనల వైపు ప్రేరించడానికి ఇన్‌స్పైర్ అవార్డు పథకం ఉపయోగపడుతుంది. గైడ్ టీచర్లకు శిక్షణ ఇచ్చాం. ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తున్నాము. అగ్రస్థానమే లక్ష్యంగా సైన్స్ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అందరి సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తాం.
–మార్ల ఓబుల్‌రెడ్డి,జిల్లా సైన్స్ అధికారి
అగ్రస్థానమే లక్ష్యం
గత సంవత్సరం జిల్లా రాష్ట్రంలో మూడోస్థానం నిలిచింది. ఈ ఏడాది అగ్రస్థానమే లక్ష్యంగా 3000 ప్రాజెక్టులు సమర్పించాలని అధికారులు నిర్దేశించారు. ఇది సాధించడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ నామినేషన్లు సమర్పించాలి. నమోదు వేగవంతం చేయడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రద్శించడానికి సరైన వేదికను అందించినట్లు అవుతుంది. –సుబ్రమణ్యం జిల్లా విద్యాశాఖ అఽధికారి

విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ

విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ

విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ

విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ