జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

Sep 8 2025 5:48 AM | Updated on Sep 8 2025 5:48 AM

జిల్ల

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

జమ్మలమడుగు రూరల్‌ : వైఎస్సార్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (వైఎస్సార్‌, అన్నమయ్య) జిల్లా స్థాయి జూనియర్‌ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు మండలంలోని ఎస్‌.ఉప్పలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎంపికలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణమూర్తి, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్‌ జిల్లా జట్టుకు బాలురు 10 మందిని, బాలికలు 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14వ తేదిల్లో అనంతరపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్‌ కన్వీనర్‌ ఓబయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సెలక్షన్‌ కమిటీ మెంబర్లు, సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లా బాలుర జట్టు

మహమ్మద్‌ బాబా (రాజంపేట) కె.కౌశిక్‌, హైడెన్‌, డి.రాజేష్‌, వెంకటేశ్‌, చిన్న ఓబులేసు (దువ్వూరు) డి.షడ్రక్‌, రఫెల్‌ (చిన్న సింగనపల్లె) ఎస్‌.మురళి, రాజు (ఒంటిమిట్ట) ఎస్‌. షాజిద్‌(రాజంపేట)

జిల్లా బాలికల జట్టు

డి.కీర్తి, డి.నయోమి (చిన్న సింగనపల్లె) ఎం.స్వీటీ (ఎస్‌.ఉప్పలపాడు) జి.వర్షిణీ (తాళ్ల ప్రొద్దుటూరు) ఎం.గౌతమి, జి.సునంద, కె.చెర్లీన్‌, ఎస్‌.అశ్వీనీ, ఎస్‌.లక్ష్మీ (చియ్యపాడు)

సౌత్‌జోన్‌ అండర్‌–23 మల్టీడే మ్యాచ్‌లు ప్రారంభం

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ అండర్‌–23 మల్టీ డే మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వైఎస్‌ఆర్‌ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని అర్జున్‌ టెండ్కూలర్‌ 64, వికాస్‌ 53 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ముఖేష్‌ చక్కగా అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్‌ 2, బాలాజీ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన చిత్తూరు జట్లు 33 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 73, రెడ్డి ప్రకాశ్‌ 20 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్‌ కుమార్‌ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో కడప– నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కడప జట్టు 43.5 ఓవర్లకు 257 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని భరత్‌రెడ్డి 66, ఎస్‌ఎండి ఆయూబ్‌ 51, శివ కేశవ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్‌ 5, ఇకాక్‌షర్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్‌ వర్మ 53, శ్రీహర్ష 31 పరుగులు చేశారు. కడప జట్టులోని వరుణ్‌తేజ్‌ రెడ్డి 3 వికెట్లు, చెన్నారెడ్డి 1 వికెట్‌ తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.

లాండ్రీ షాపులో అగ్నిప్రమాదం

మైదుకూరు : లాండ్రీ నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఆదివారం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు రాజారెడ్డి వీధిలో ఉంటున్న కంచర్ల ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లాండ్రీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్విచ్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు రేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫ్రిడ్జ్‌, మోటార్‌, టీవీ, బియ్యంతోపాటు ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు, శుభ్రం చేసి ఇసీ్త్ర చేసేందుకు తీసుకొచ్చిన పలువురి పట్టుచీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక అధికారి, సిబ్బంది సంఘటన జరిగిన ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆంజనేయులు కోరారు.

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక
1
1/3

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక
2
2/3

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక
3
3/3

జిల్లా బ్యాడ్మింటన్‌ జట్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement