పలు రైళ్లు ఇక హాల్టింగ్‌ | - | Sakshi
Sakshi News home page

పలు రైళ్లు ఇక హాల్టింగ్‌

Sep 9 2025 8:16 AM | Updated on Sep 9 2025 12:48 PM

పలు రైళ్లు ఇక హాల్టింగ్‌

పలు రైళ్లు ఇక హాల్టింగ్‌

ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ

నందలూరులో ఆగనున్న జయంతి

రాజంపేట : దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లకు హాల్టింగ్స్‌ను పునరుద్ధరిస్తూ సౌత్‌సెంట్రల్‌ రైల్వే సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌లలో పలు రైళ్ల హాల్టింగ్స్‌కు రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 10 నుంచి 12163(చైన్నె–ముంబై సూపర్‌) నంబరు గల రైలుకు కోడూరులో హాల్టింగ్‌ ఇచ్చారు. 16351(ముంబాయి–నాగర్‌కోయల్‌) నంబరు గల రైలు రాజంపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో ఈ నెల 12న నుంచి హాల్టింగ్‌ ఉంది.

16352 (నాగరకోయిల్‌ –ముంబాయి)నంబరు గల రైలుకు రాజంపేట, రైల్వేకోడూరులో ఈ నెల 11 నుంచి హాల్టింగ్‌ ఇచ్చారు. 16381/16382 నంబరు గల జయంతి రైలు నందలూరు, కోండాపురంలో ఈ నెల 10 నుంచి హాల్టింగ్‌ ఉంది. 17415/17416 నంబరు గల (తిరుపతి–కోల్హాపూర్‌) రాజంపేట, ఓబులవారిపల్లెలో హాల్టింగ్‌ ఇచ్చారు. ఈనెల 10 నుంచి ఈ హాల్టింగ్‌ అమలులోకి రానున్నది. 17622 నంబరు గల(గుంటూరు–తిరుపతి) రైలుకు ఎర్రగుంట్లలో ఈ నెల 13 నుంచి హాల్టింగ్‌ ఇచ్చారు. 17652 (కాచిగూడ –చైన్నె ఎగ్మోర్‌) నంబరు గల రైలుకు కోడూరు రైల్వేస్టేషన్‌లో ఈ నెల 11 నుంచి హాల్టింగ్‌ కొనసాగనున్నది. 18521/18522 నంబరు గల నందలూరు రైల్వేకేంద్రంలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలుకు ఈనెల 10 నుంచి హాల్టింగ్‌ను ఇచ్చారు. 20953/ 54(చైన్నె–అహమ్మదాబాద్‌) నంబరు గల రైలు రాజంపేట, రైల్వేకోడూరులో ఈ నెల 13 నుంచి హాల్టింగ్‌ ఉంది. 22102 నంబరు గల (ముంబాయి–మధురై.వీక్లీ) రైలుకు రాజంపేటలో ఈనెల 19 నుంచి హాల్టింగ్‌ ఇచ్చారు. 22157 /22158 (ముంబాయి–చైన్నె ఎగ్మోర్‌ సూపర్‌ఫాస్ట్‌ మెయిల్‌) నంబరు గల రైలుకు రాజంపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్‌లో ఈ నెల 10 నుంచి హాల్టింగ్‌ను ఇచ్చారు.

ఎంపీ మిథున్‌రెడ్డి కృషితో..

జిల్లాలో రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, రాజంపేట రైల్వేస్టేషన్‌లలో పలు రైళ్ల హాల్టింగ్స్‌ ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కృషితో మంజూరైనట్లుగా గుంతకల్‌ రైల్వే డీఆర్‌యుసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేశాఖమంత్రితోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎంలకు హాల్టింగ్స్‌ విషయంపై తెలియచేయడం జరిగిందన్నారు. ఎంపీ తరఫున తాను కూడా జీఎంను కలిసి ఎంపీ మిథునరెడ్డి సహకారంతో వినతులను అందజేశామన్నారు నందలూరు రైల్వేకేంద్రంలో జయంతి ఎక్స్‌ప్రెస్‌రైలుకు హాల్టింగ్‌ ఇవ్వడం జరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement