గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : పట్టణంలోని కోమటివానిచెరువులో గుర్తు తెలియని వ్యక్తి (50) మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారించగా చిత్తుకాగితాలను ఏరుకుంటూ ఉండేవాడని తెలిసింది. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని గుర్తించినవారు టు టౌన్ పోలీసు స్టేషన్ సీఐ నంబర్ 9491074519, ఎస్.ఐ 9440796741కు సమాచారం అందించాలని టు టౌన్ సీఐ రాజారెడ్డి కోరారు.
వివాహిత ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్య కారణాలతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లెలో జరిగింది. చిప్పిలికి చెందిన చంద్రకళ (27) వన్‌టౌన్ పరిధిలోని నక్కలదిన్నె పంచాయతీ చుక్కలతాండాకు చెందిన చంద్రశేఖర్‌నాయక్‌ను కొంత కాలం క్రితం రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో చంద్రకళ గత కొంత కాలంగా కడుపునొప్పి కారణంగా అనారోగ్యం పాలైంది. పలు చోట్ల చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్థాపం చెంది సోమవారం ఇంటిలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు.
ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిల
వేంపల్లె : నేడు మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమార్తె పీసీసీ చీఫ్ షర్మిల మంగళవారం ఆయన సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. సోమవారం సాయంత్రం వీరు ఇడుపులపాయకు కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకు షర్మిల వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పిస్తారు.
అదుపు తప్పి ముళ్ల పొదల్లోకి వెళ్లిన కారు
సిద్దవటం : సిద్దవటం మండలం, కడప–చైన్నె జాతీయ రహదారి భాకరాపేట గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నగరంలోని ఐటీఐ సర్కిల్‌కు చెందిన వెంకటరమణ, ఆయన భార్య ఈశ్వరమ్మ, కుమార్తె యామినితో కలిసి ఒక శుభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రేణిగుంటకు కారులో బయలుదేరారు. కారు సిద్దవటం మండలంలోని శనేశ్వరస్వామి ఆలయం దాటుకొని వస్తుండగా ఆవు అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఈశ్వరమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్ రఫీ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్రేన్ సహాయంతో కారును బయటకు తీశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి మృతి


