
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్‌లు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్‌లు మూడో రోజు డ్రాగా ముగిశాయి. కడప–చిత్తూరు జట్ల మధ్య కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన కడప జట్టు 117.4 ఓవర్లలో 406 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నాగ చైతుర్య 339 బంతుల్లో 25 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 174 పరుగులు చేసి ఆడాడు. షేక్ ఆదిల్ హుస్సేన్ 66 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని ముకేష్ 3 వికెట్లు, రెడ్డి ప్రకాశ్ 3 వికెట్లు, బ్రహ్మ తేజ్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో చిత్తూరు జట్టు ఆధిక్యం సాధించింది.
భారీ ఆధిక్యం సాధించిన నెల్లూరు జట్టు
వైఎస్‌ఆర్‌ఆర్ స్టేడియంలో నెల్లూరు–కర్నూలు జట్ల మధ్య సోమవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 34.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 51 పరుగులు, నిఖిలేశ్వర్ 30 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాయి సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 63 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 81 పరుగులు, సాయి సూర్యతేజ రెడ్డి 62 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 3 వికెట్లు, మాధవ్ 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్‌లు