
కరడుగట్టిన దొంగల అరెస్టు
కడప అర్బన్ : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే అర కిలో బంగారం, రూ.10 లక్షల విలువ చేసే పది కిలోల వెంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు.
కడప జిల్లా బద్వేల్ టౌన్ పరిధిలోని చెన్నంపట్టిమిట్ట వద్ద నివాసముంటున్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, గౌరీశంకర్‌నగర్‌కు చెందిన నూతి వెంకటసుబ్బయ్య గత రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లు పగలు గుర్తించడం, రాత్రి చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు. వీరు ఎరచ్రందనం అక్రమ రవాణా చేయడమేగాక, కడప, నెల్లూరు జిల్లాలో తాళం వేసిన ఇళ్ల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఇళ్ల చోరీలో తక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించడంతో సంతృప్తి చెందక, ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దోచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లోని బంగారు దుకాణాలకు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గుంటూరులో బైక్ చోరీ చేశారు. ఈ ప్రయత్నంలోనే గతంలోనూ అరెస్టుయి జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. తీరికసమయాల్లో పేకాడడం, సహచరులతో లంకమల అడవికి వెళ్లి నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడడం చేశారు. గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై గతంలో 28 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా, 38 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతడిపి పీడీ యాక్ట్ ఉండడమేగాక, జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు.
చోరీలు పెరగడంతో పోలీసుల నిఘా
జిల్లాలోని పోరుమామిళ్ల, బి.కోడూర్, మైదుకూర్, బద్వేల్ టౌన్, కలసపాడు, ఖాజీపేట, కాశినాయన, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కీచేసి, రాత్రి సమయాలలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీలు ఇటీవల పెరిగాయి. దాదాపు 12 ఇళ్లు, బంగారు దుకాణంలోనూ ఈ చోరీలు జరగడంతో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ సీరియస్‌గా తీసుకున్నారు. మైదుకూర్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, మైదుకూరు యూసీపీఎస్ ఇన్‌స్పెక్టర్ రమణారెడ్డి, బద్వేల్ రూరల్ ఎస్‌ఐ కె.శ్రీకాంత్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించి నిఘా పెంచారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని చెలిమికుంట అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలు నరికి కర్ణాటకలోని కటికనహళ్లికి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్య ఎరచ్రందనం రవాణా చేసూం్త పట్టుబడ్డారు. వారి నుంచి బొలెరో వాహనం, నాలుగు ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించగా గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులని గుర్తించారు. అనంతరం పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలియడంతో అరెస్టు చేశారు.
పోలీసులకు ఎస్పీ ప్రశంస
మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్యలను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసి, చోరీ సొత్తు, ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ రికవరీ చేసిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, రమణారెడ్డి, కె.శ్రీకాంత్, చిరంజీవి, శివప్రసాద్, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు.
అర కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం
నాటు తుపాకీ, బొలెరో వాహనం, ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కరడుగట్టిన దొంగల అరెస్టు