
థర్మాకోల్ ప్లేట్లలో ఆహారం తింటే ప్రమాదం
చిన్నమండెం : థర్మాకోల్ పేట్లలో ఆహారం తీసుకుంటే ప్రమాదమని ఆహార భద్రతా అధికారి వెంకటరెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండల కేంద్రంలో ఇటీవల పానీపూరీ విక్రయిస్తున్న దుకాణాల్లో థర్మాకోల్ ప్లేటు వాడుతున్న విషయం గమనించి వ్యాపారులను మందలించామని తెలిపారు. వినియోగదారుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వసుత్న్నాయని తెలిపారు. జనాల బలహీనతలతో వ్యాపారం చేయకూడదని, మండల వ్యాప్తంగా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేపట్టామన్నారు. వేడిగా ఉన్న కట్‌లెట్, పానీపూరీ తదితర ఫాస్ట్‌ఫుడ్ థర్మాకోల్ ప్లేట్లలో ఇవ్వడం గుర్తించామన్నారు. వాటిలో ఆహారం తీసుకుంటే ప్లాస్టిక్ కణాలు వేడికి ఆహార పదార్థాల్లో కలిసి కడుపులోకి వెళ్తాయని, కాలేయం దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. క్రమంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్టీలు పాత్రలే వాడాలని, పానీపూరి తయారీలో నాణ్యత విలువలు పాటించాలని సూచించారు.