
మున్సిపల్ కమిషనర్‌గా రవి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ కమిషనర్‌గా జి రవి నియమితులయ్యారు. స్థానికంగా పనిచేస్తున్న కమిషనర్ వాసుబాబును నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయవాడలో మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జి రవిని బదిలీపై ఇక్కడ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బాధ్యతల స్వీకరణ
రాజంపేట: రాజంపేట సబ్‌కలెక్టర్‌గా హెచ్‌ఎస్ భావన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టరేట్‌కు ఆమె వచ్చిన సందర్భంగా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇక్కడ పనిచేసిన వైకోమానైదియాదేవిని బదిలీ చేశారు. ఈమె స్ధానంలో భావనను ప్రభుత్వం నియమించింది.
● బాధ్యతలు తీసుకున్న అనంతరం సబ్‌కలెక్టర్ భావన రాయచోటి లోని కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్‌నుమర్యాదపూర్వకంగా కలిశారు.
● బదిలీ అయిన సబ్‌కలెక్టర్ వైకోమానైదియాదేవిని కలెక్టరేట్ సిబ్బంది సన్మానించి, వీడ్కోలు పలికారు. అయితే ఈమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనాధికారి శ్రీధర్, సబ్‌కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి కన్నడ భక్తుడు రూ.1,00,000 విరాళం సమర్పించారు. కర్నాటక రాష్ట్రం ఆహార భద్రత శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప ఆయన భార్య నాగరత్నమ్మలు నెల రోజుల క్రితం లక్కిరెడ్డిపలె శ్రీ మాతంగి పీఠం నిర్మించేందుకు వచ్చినపుడు శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే నిత్యాన్నదానం కోసం విరాళం అందిస్తానని చెప్పారు. ఆయన ప్రతినిధితో రూ.1లక్ష స్కాన్ ద్వారా స్వామి వారి ఖాలో జమ చేశారు. ఈ మొత్తం ద్వారా వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు.

మున్సిపల్ కమిషనర్‌గా రవి