
పోలీసుల అదుపులో నిందితుడు
నందలూరు : నందలూరు పోలీసు స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న తిరుపతి పట్టణం కరకంబేడు వీధికి చెందిన చంద్ర రమేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను స్టోర్ బియ్యం విక్రయం కేసులో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితుడిని సోమవారం నందలూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
ఆటో ఢీకొని వృద్ధురాలి మృతి
కలికిరి : ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం కలికిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కేవీ పల్లి మండలం నూతనకాల్వ గ్రామం దిండువారిపల్లికి చెందిన చింతపర్తి మంగమ్మ(82) కలికిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా కలికిరి పట్టణానికి చెందిన సుబహాన్ ఆటోతో ఢీకొన్నాడు. ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంగమ్మ కుమార్తె రామ కుమారి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవరు సుబహాన్‌పై కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ మదన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
మున్సిపల్ ఉద్యోగిపై దాడి
మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. రామారావుకాలనీకి చెందిన సుధాకర్ మున్సిపాలిటీలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధుసూదన థియేటర్ సమీపంలోని ఎస్‌కే.ఆయిల్ స్టోర్స్ వెనుకవైపున ఉన్న ఇంటిలో ఉండగా, కుటుంబ వివాదంలో భాగంగా గాంధీపురానికి చెందిన రాజా, రవి, ప్రదీప్ అనుచరులతో వచ్చి సుధాకర్‌పై దాడికి పాల్పడ్డారు. దాడిలో సుధాకర్ తీవ్రంగా గాయపడగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట రూరల్ : జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ విభాగంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–2025లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులను జేఎన్‌వీవైఎస్‌ఆర్‌డీఐఎస్‌టీఆర్‌ఐసీటీ జీ మెయిల్.కాం చిరునామాకు మెయిల్ చేయాలని కోరారు.

పోలీసుల అదుపులో నిందితుడు

పోలీసుల అదుపులో నిందితుడు